నెల్లూరు ప్రజలు బాగుండాలని రొట్టె పట్టిన కేతంరెడ్డి*

  • Avatarby ketham reddy vinod reddy
  • Sep 12, 2019
  • 0
  • Category:

నెల్లూరు ప్రజలు బాగుండాలని రొట్టె పట్టిన కేతంరెడ్డి*

నెల్లూరు ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు
సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉందాలని కోరుకొని రొట్టెని స్వీకరించడం జరిగిందని నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. అదే విధంగా అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన రొట్టెను అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ భగవంతుని ఆశీస్సులతో,రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి అని కోరుతూ జనసేన పార్టీ నాయకుల నుంచి రొట్టెను అందుకున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు జనసేన పార్టీ నుండి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా గెలుపొంది చట్టసభల్లో ప్రజా సమస్యల కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటూ రొట్టెను పట్టడం జరిగింది. కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా నెల్లూరు బారా షహీద్ దర్గా నందు జరిగే రొట్టెల పండుగ ప్రపంచంలోనే ఎక్కడాలేని ప్రత్యేకతను సంతరించుకుందని ఈ పండగని గత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం ఆహ్వానించదగినటువంటి విషయం అని అన్నారు..సర్వ మతాల వారు కాలిసి జరుపుకుంటూ.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇలాంటి పండుగ నెల్లూరులో జరుపుకోవడం నెల్లూరు ప్రత్యేకతే కాకుండా ఇలాంటి సంస్కృతిని కొనసాగించడం నెల్లూరు ప్రజల యొక్క గొప్పతనం అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు అనంతరం దర్గాలోని బారాషహీద్లను దర్శించుకుని నెల్లూరు ప్రజలు బాగుండాలని అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ప్రజలకు మంచి చేసే విధంగా వారి నాయకత్వంలో జనసేన ముందుకు పోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, ఆలియా, ఇందిరా, శిరీష, కార్తిక్, సుభాని, మాజహర్, అస్లాం, బాలకృష్ణ , ఇమ్రాన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment