The role of counting agents is crucial. – Janasena Party Nellore City MLA candidate Ketamreddy Vinod Reddy

*కౌంటింగ్ ఏజెంట్ల పాత్రే కీలకం.- జనసేన పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి*

ఈ నెల 23వ తేదీ జరగబోయే ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కౌంటింగ్ ఏజెంట్లు చాలా ముఖ్యమైనటువంటి భాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని జనసేన పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేసి, లెక్కింపు కేంద్రంలో వ్యవహరించాల్సిన విధానాలపై సూచనలు చేశారు. నెల్లూరు నగరంలోని దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాలలో నెల్లూరు నగర నియోజకవర్గం యొక్క ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నిర్దిష్ట సమయానికి
లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని తెలియజేశారు. పూర్తిస్థాయిలో ఎన్నికల ఫలితాలు ప్రకటించేంత వరకు లెక్కింపు కేంద్రాల నుండి ఎవరూ బయటికి రావద్దని తెలియచేసారు..నెల్లూరు నగర నియోజక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
నెల్లూరు సిటీ లో 2009 ఎన్నికలలో త్రిముఖ పోటీలో 90 ఓట్ల తేడాతో గెలుపు ఓటములు మారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.. లాటరీ ద్వారా ఎంపిక చేసిన 5 బుతుల్లో వీ.వీ ప్యాడ్లు స్లిప్పులు లెక్కిస్తారని, ఆ సమయంలో అనుసరించాల్సిన నియమావళిని తెలియ చేశారు.నెల్లూరు నగర నియోజక వర్గ ప్రజలు ఆశీస్సులతో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *