మాదక ద్రవ్యాలను నివారించాలని నెల్లూరు లో డ్రగ్స్ మాఫియా

గౌరవనీయులైన
జాయింట్ కలెక్టర్ గారికి,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.

జనసేన పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి నమస్కరించి వ్రాయు మనవి.

విషయం: నెల్లూరు నగరంలో మరియు జిల్లాలో విద్యార్థులు మరియు యువతలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం – మానసిక వేదనకు గురవుతున్న వేలాది మంది యువత తల్లిదండ్రులు – డ్రగ్స్ మహమ్మారిపై నివారణ చర్యలు నిమిత్తం – అభ్యర్ధన.

సార్,

ఈ నెల 7వ తేదీన గౌరవ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి గారు నగరంలోని ఓ కళాశాల విద్యార్థి డ్రగ్స్ అమ్మకం కేసులో పట్టుబడిన వ్యవహారం, నగరంలోని విద్యార్థులు, యువతలో మాదక ద్రవ్యాలు ఏ రకంగా వ్యసనంగా తయారై ఉన్నాయో ఆయన తెలిపిన వివరాలు మేరకు, జిల్లాలోని ప్రముఖ వార్తాపత్రికల్లో ఈ మాదక ద్రవ్యాల వినియోగం పై వస్తున్న కథనాలను విశ్లేషించుకుని మరియు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఈ డ్రగ్స్ ను నగరంలో కాలేజీ విద్యార్థులే కాకుండా స్కూల్ విద్యార్థులు కూడా ఓ అలవాటుగా మార్చుకుంటున్నారని, ఈ వ్యసనానికి బానిసలు అవుతున్నారని గ్రహించి జనసేన పార్టీ తరఫున తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేలా గత కొద్ది రోజులుగా పార్టీ తరఫున పోరాటాలు సైతం చేస్తున్నాం. ప్రముఖ పత్రికలు విద్యార్థుల్లో, యువతలో ఈ డ్రగ్స్ వినియోగం ఎలా పెరిగిపోయిందో తెలిపిన ఉదాహరణలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. గంజాయి, కొకైన్, MDMA, MDMA పిల్స్, LSD తదితర డ్రగ్స్ నగరంలో అందుబాటులో ఉండడం, విద్యార్థులు ఆ మత్తులో జోగుతుండడం బాధాకరం. ఈ డ్రగ్స్ విద్యార్థుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి భవిష్యత్తులో వారికి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయమై పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి తమ బిడ్డలను ఈ మహమ్మారి నుండి బయటపడే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది. మరి కొంతమంది నేరుగా పోలీసుల వద్దే తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిసింది. డ్రగ్స్ కేసుల్లో దొరుకుతున్న విద్యార్థులను వారి భవిష్యత్ దృష్ట్యా పోలీసు శాఖ వారు కూడా బాధ్యతతో వ్యవహరించి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్న సంఘటనలు నగరంలో జరుగుతున్నాయి.

జిల్లాలో ఈ డ్రగ్స్ ప్రభావం ఇంతగా ఉన్నా పోలీసు శాఖ వారు తమ పరిధి మేరకు నివారణ చర్యలు చేపడుతున్నారు కానీ ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి ప్రక్షాళన చర్యలు, డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులు, యువతను ఆ మహమ్మారి నుండి బయట పడేసే చర్యలు కనపడట్లేదు. కనుక ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి వీటి నివారణ కొరకు ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని, డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులను, యువతను దాని నుండి బయటపడేసేలా కౌన్సెలింగ్ ఇచ్చే వ్యవస్థను, డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారికి ప్రభుత్వ వైద్య సహాయం, రీహబిలిటేషన్ సెంటర్ ను అందరికి అందుబాటులో ఉండేలా నగరంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ధన్యవాదములు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,విద్యార్థి విభాగం నాయకులు కార్తిక్,సారధి,జయదేవ్,షారుఖ్ యువజన విభాగం నాయకులు మాజహర్,వెంకట్ యువరాజ్,చందు తదితరులు పాల్గొన్నారు.

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *