JanaSena Party Nellore City Campaign

ఇటీవల దుండగుల దాడిలో గాయపడిన టి.ఎన్.ఎస్.ఎఫ్. జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుని జనసేన పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి పరామర్శించారు.
శాంతి యుతమైన నెల్లూరు రాజకీయ సంస్కృతిలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరం అని ఆయన అన్నారు..ప్రజస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని..ఎవరికి నచ్చిన పార్టీలకు వారు పని చేసుకునే స్వాతంత్రం ఉంటుందని,ఇతర పార్టీల నాయకులు దీనిని అర్థం చేసుకుని సామరస్యమైన ధోరణి లో ప్రజా రాజకీయాలు చేయాలని హితవు పలికారు..కష్టాల్లో ఉన్నపుడు పార్టీలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలిచే సంప్రదాయం నెల్లూరు వారికి ఉందని ఆయన తెలియచేసారు.అనంతరం తిరుమల నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి,కోలపల్లి దివాకర్,కాకు మురళి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

 

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *