Narayan City to neglect municipal workers and employees in own companies

మునిసిపల్ కార్మికులను, సొంత సంస్థలలో ఉద్యోగులను నిర్లక్ష్యం చేసే నారాయణ నగరాన్ని ఉద్దరిస్తారా?? …
– #ఎన్నికల_ప్రచారంలో_జనసేన_అభ్యర్థి_కేతంరెడ్డి_వినోద్_రెడ్డి.

ప్రచార ఆర్భాటాలు తప్ప మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేసింది ఏమి లేదని జనసేన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి కేతంరెడ్డి అన్నారు…నెల్లూరు నగర నియోజకవర్గంలోని 49వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో ఆయన వామపక్ష నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు..ఆయన మాట్లాడుతూ
గత 4 ఏళ్లపాటు అసలు ప్రజలకు అసలు అందుబాటులేని నారాయణ ఈరోజు ఎన్నికల కోసం నగర ప్రజలపైన కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు.
సొసైటీ మునిసిపల్ కార్మికులు కేతంరెడ్డిని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. గత మూడు నెలల నుండి జీతాలు కూడా ఇవ్వలేదని..అదేంటి అని అడిగితే,నారాయణ అండతో కొందరు అధికారులు బెదిరింపులు,వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వెళ్లబోసుకున్నారు..కేతం రెడ్డి వాళ్లకు న్యాయం చేస్తామని,కార్మికులకు అండగా జనసేన ఉంటుందని హామీ ఇచ్చారు.సొంత శాఖలో కార్మికులను,తన విద్య- వైద్య సంస్థలలో పని చేసే ఉద్యోగులని గాలికి వదిలేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న నారాయణ, నెల్లూరు నగర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తారు??
ప్రజలకు భరోసా కలిగించడం లో ఎమ్మెల్యే అనిల్,మంత్రి నారాయణ ఇద్దరూ విఫలమయ్యారని అందుకే సామాన్య ప్రజలు,తనకు అండగా నిలుస్తున్నారని..పేదల ఇళ్లకు వెళుతుంటే వాళ్ళు చూపించే ఆదరణ,ఆప్యాయత వలన ప్రజల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందని ఆయన అన్నారు..సీపీఎం,సీపీఐ, బీఎస్పీ పార్టీల అండతో..నెల్లూరు నగర ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు చంద్రారెడ్డి, జనసేన నాయకులు కారంపూడి కృష్ణా రెడ్డి,పావుజెన్నీ శేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,ప్రసాద్,మోషే,రేవంత్,కమల్,సృజన్,మోహన్,వెంకట్, కార్తిక్,అలెక్స్ ,మహిళలుషేక్ ఆలియా,సిరీషా రెడ్డి,జ్యోతి,వామపక్షాల నాయకులు,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *