Removal of the house of the poor is unfair

15-6-19
*పేదల ఇల్లు తొలగింపు అన్యాయం*
– జనసేన నెల్లూరు నగర ఇన్చార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 వ డివిజన్ వెంకటేశ్వపురం గాంధీ గిరిజన కాలని ప్రాంతంలోని గిరిజనుల ఇళ్ల తొలగింపు అన్యాయం అని జనసేన నెల్లూరు నగర ఇంచార్జి కేతంరెడ్డి అన్నారు..శనివారం గాంధీ గిరిజన కాలనీ లోని బాధితులతో ,ఆయన మాట్లాడారు…ఇల్లు తొలిగించిన ప్రదేశాన్ని పరిశీలించారు…వారి సమస్య తెలుసుకునేందుకు వచ్చిన కేతంరెడ్డి తో బాధితులు వారి గోడును వెళ్లబోసుకున్నారు..

అనంతరం కేతంరెడ్డి మాట్లాడుతూ…
70 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వారిని,ఉన్నపళంగా కాళీ చేయించి,వారి కుటుంబాలను రోడ్లపైకి నెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
అకస్మాత్తుగా వచ్చి దాదాపు 40 ఇళ్లను,గుడిసెలను కూల్చివేసారని ఇది అమానుషమైన చర్య అని ఆయన అన్నారు..కొన్ని దశాబ్దాలుగా అక్కడి నేలతో అనుబంధం ఏర్పరుచుకున్న నిరుపేదలైన గిరిజనుల మనోభావాలను గాయపరిచి వారిని వేదనకు గురి చేయడం ,వారిని మానసికంగా హత్య చేయడంతో సమానం అని ఆయన అన్నారు..పేదల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి,వారికి భరోసా ఇవ్వాలని ఆయన కోరారు.పేదల కోసం,సామాన్యులకు ఏ సమస్య వచ్చినా జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోలపల్లి దివాకర్,కాకు మురళి రెడ్డి, డా”కత్తి తిరుమల,సురేష్ నాయుడు,మహిళా నాయకురాలు ఆలియా,భాస్కర్,మల్లేశ్వర రావు,కార్తిక్,అబ్బు,చక్రి,పవన్ తదితరులు పాల్గొన్నారు.

ketham reddy vinod reddy

“In the path of Congress ,with a vision of Youth Congress. A long journey where i get active everyday instead of tiring.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *