Young people in the state are watching Janesena

జ‌న‌సేనవైపే యువ‌త చూపు

రాష్ట్రంలో యువ‌తంతా జ‌న‌సేన వైపే చూస్తోంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భంజ‌నం సృష్టించ‌నున్నాడ‌ని ఆ పార్టీ నెల్లూరు జిల్లా నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. న‌గ‌రంలోని శెట్టిగుంట రోడ్డులో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి నేతృత్వంలో భారీగా యువ‌త జ‌న‌సేన‌లో చేరారు. ఇక్క‌డ జ‌న‌సేన జెండాలు ఎగుర‌వేసి, బాణాసంచా కాల్చి, కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. యువ‌త‌కు వినోద్‌రెడ్డి జ‌న‌సేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేతంరెడ్డి వినోద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం జ‌న‌సేన అధికారంలోకి రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార‌, విప‌క్షాల‌కు ప్ర‌జ‌లు గుర్తుకువ‌స్తున్నార‌ని, ఈ నాలుగున్న‌రేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేసిందేంటో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించే స‌త్తా ఒక్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే ఉంద‌ని చెప్పారు. ముఖ్యంగా యువ‌త‌ను చంద్ర‌బాబు మోస‌గిస్తున్నార‌ని, నిరుద్యోగ బృతి పేరుతో ద‌గా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అలానే వైసీపీ సైతం యువ‌త‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌న్న కేతంరెడ్డి జ‌న‌సేన‌లో యువ‌త‌కు ప్రోత్సాహం ఉంటుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త ప‌వ‌న్ వెంటే న‌డుస్తున్నార‌ని, ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా వంద‌ల సంఖ్య‌లో యువ‌త స్వ‌చ్చందంగా పాల్గొంటున్నార‌ని తెలిపారు. అటు టీడీపీ, ఇటు వైకాపాలు త‌మ స‌భ‌ల‌కు జ‌నాల‌ను తోలుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని, ప‌వ‌న్ స‌భ‌కు జ‌నం స్వ‌చ్చందంగా వ‌స్తున్నార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇక యువ‌త జ‌న‌సేన‌లో స‌భ్య‌త్వాలు న‌మోదు చేసుకోవాల‌ని, ఎక్క‌డ ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. నెల్లూరు న‌గ‌రం నుంచే జ‌న‌సేన విజ‌యం మొద‌ల‌వుతుంద‌ని, జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన బ‌లాన్ని చూపిస్తామ‌ని కేతంరెడ్డి వినోద్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా స్ధానిక యువ‌త పెద్ద సంఖ్య‌లో శెట్టి గుంట రోడ్డుకు చేరుకుని కేతంరెడ్డికి పార్టీ కండువాలు క‌ప్పి, జ‌న‌సేనాని నాయ‌క‌త్వంలో తామంతా ముందుకెళ్తామ‌ని హామీ ఇచ్చారు

ketham reddy vinod reddy

A long journey where i get active everyday instead of tiring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *