కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ #JanaSeva
—————————
దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తమ వంతు తోడ్పాటును అందించాలని భావిస్తూ నెల్లూరు సిటీ జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు సిటీ కార్యాలయం వద్ద పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన కూరగాయల సంచులను కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో పంపిణీ చేసారు. కొన్ని ప్రాంతాలను కేతంరెడ్డి సందర్శించి సామాజిక దూరం పాటిస్తూ పేదల ఇంటి వద్దకే వెళ్లి అందించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నెల్లూరు నగరంలో తమవంతు సాయంగా 9000 కేజీల కూరగాయలను నగరంలోని పొర్లుకట్ట, బోడిగాడితోట, వెంకటేశ్వరపురం, నవాబుపేట, చిల్డ్రన్స్ పార్కు ప్రాంతం తదితర ప్రాంతాల్లో పంపిణీ చేశామని అన్నారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికొకరు సాయపడుతూ ముందుకు సాగాలని అభిలషించారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలో అగ్రరాజ్యాలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మనం మన దేశంలో అవలంభించిన విధానాల కారణంగానే అదుపులో ఉందన్నారు. ప్రజలకు కష్టమని తెలిసినా ప్రభుత్వాలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపాయని, ప్రజలందరూ అదే రీతిలో ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తున్నారని, నేడు ప్రజలకు కలిగే ఆర్ధిక ఇబ్బందులను కొంతమేరకైనా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం అందించే 1000 రూపాయల సాయం ఇప్పటికి కూడా తమకు అందలేదని అనేకమంది తెల్ల రేషన్ కార్డు కల్గిన పేదలు తనకు మొరపెట్టుకున్నారని, టెక్నికల్ అంశాలు సరిదిద్ది ప్రభుత్వం అందరికి 1000 రూపాయలు అందించాలని ఆయన డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, ఉడాలి సూర్య నారాయణ, కాకు మురళి రెడ్డి, సురేష్ నాయుడు, మల్లేశ్వరరావు, భాస్కర్, మహిళా నాయకులు షేక్ అలియా, శిరీష రెడ్డి, మహేష్, మోషే, శ్రీకాంత్, రేవంత్, కార్తీక్, సాయి, హేమంత్, చందు, కిరణ్, సూరి తదితరులు పాల్గొన్నారు.

ketham reddy vinod reddy

A long journey where i get active everyday instead of tiring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *