ఎస్పీ బాలసుబ్రహ్మణం పేరుతో నేషనల్ అవార్డు ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణం పేరుతో నేషనల్ అవార్డు ప్రకటించాలి
నెల్లూరులో ఏదైనా ప్రధాన కూడలిలో బాలు విగ్రహం ఏర్పాటు చేయాలి
-జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నేడు నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో అజరామర కీర్తి పొందిన గాన గంధర్వుడు నేడు మన మధ్య లేకపోవడం అనే అంశాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళినా ఆయన పాడిన పాటలు ప్రతిరోజూ ప్రతి ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి, ఆయన మనమధ్య ఎప్పటికీ బ్రతికే ఉంటారు. బాలు గారు మన నెల్లూరు వాసి కావడం మనందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం. ఆయన ఘనకీర్తిని చాటేలా నెల్లూరు నగర ప్రధాన కూడళ్ళలో ఒక చోట వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు తరహాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పేరిట జాతీయ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి సంగీత రంగంలో ప్రతిభ కలవారికి అవార్డులను అందివ్వాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, బొబ్బేపల్లి సురేష్ బాబు, లక్ష్మీమల్లేశ్వర రావు, పోలంరెడ్డి ఇందిరా రెడ్డి, షేక్ ఆలియా, శిరీషా రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కుక్కా ప్రభాకర్,హేమంత్, సాయి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.