జనసేనాని పిలుపుకి మద్దతుగా వీరమహిళల దీపాలార్చన

  • Avatarby ketham reddy vinod reddy
  • Sep 11, 2020
  • 0
  • Category:
జనసేనాని పిలుపుకి మద్దతుగా వీరమహిళల దీపాలార్చన
రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా దేవుళ్ళ విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలకు నిరసనగా శుక్రవారం సాయంత్రం దీపాలు వెలిగించి హారతులు ఇస్తూ సంఘీభావం తెలపండి అని మహిళలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లోని సాయి బాబా మందిర ప్రాంగణంలో జనసేన పార్టీ వీరమహిళలు దీపాలు వెలిగించి, హారతులు ఇచ్చి తమ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో దీపానికి విశిష్ట ప్రాధాన్యం ఉందన్నారు. జ్యోతి ప్రజ్వలాన్ని దేవుని స్వరూపంగా భావిస్తామన్నారు. నేడు మన రాష్ట్రంలో సనాతన ధర్మానికి భంగం కలిగేలా అనేక సంఘటనలు జరుగుతున్నా, మతసామరస్యం దెబ్బతినే ఘటనలు జరిగినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి బుద్ధి కలిగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారి పిలుపుకి అనుగుణంగా జనసేన వీరమహిళలు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు పోలంరెడ్డి ఇందిరారెడ్డి, శిరీషారెడ్డి, లావణ్య నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళీరెడ్డి, బొబ్బేపల్లి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment