జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటరు సహాయ కేంద్రాలు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓటరు సహాయ కేంద్రాలు
————————
త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మునిసిపల్ కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితాలు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్న క్రమంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ లలో పార్టీ కార్యకర్తలు ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు తమ డివిజన్ లలో ఓటరు జాబితాలు పరిశీలన కొరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు. పలువురు ప్రజలు తమ ఓటు ఏ క్రమంలో ఉందో చూసుకున్నారు, ఓటు తొలగింపబడ్డ వారికి పార్టీ కార్యకర్తలు నమోదు ఎలా చేసుకోవాలో సూచనలు ఇచ్చారు. కొన్ని డివిజన్లలోని ఓటరు జాబితాల్లో కేవలం ఓటరు ఫోటో మాత్రమే ముద్రితం అయి, పేరు, తండ్రి పేరు వంటి వివరాలు నమోదు కాకపోవడం గమనించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఒక్కరికే రెండు ఓట్లు ఉండే అంశాన్ని సైతం కార్యకర్తలు గుర్తించారు.

ఈ సహాయ కేంద్రాల ద్వారా వచ్చిన అభ్యర్ధనలను నాయకులు కేతంరెడ్డి వినోద్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే మునిసిపల్ శాఖాధికారులకు ఈ అభ్యంతరాలు తెలుపనున్నారు. పై కార్యక్రమాలలో డివిజన్ నాయకులు చింతం రెడ్డి శిరీష, వెంకటేష్, చందు, కార్తీక్, మహేష్, మధు, మోషే.. తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment