ఝాన్సీ లక్ష్మీబాయి స్పూర్తితో జనసేన పార్టీ పని చేస్తుంది

*ఝాన్సీ లక్ష్మీబాయి స్పూర్తితో జనసేన పార్టీ పని చేస్తుంది.*
– జనసేనపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి.
———————————————
ధైర్యం,సాహసం,త్యాగం వంటి పదాలకు ఝాన్సీ లక్ష్మిబాయి నిలువెత్తు నిదర్శనం అని
జనసేన పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.. జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయంలో జనసేన మహిళా విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్థానం ఎంతో ప్రత్యేకమైనదని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీరవనిత అని అన్నారు. ఆ మహనీయురాలు స్ఫూర్తితోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మహిళా విభాగం ప్రారంభించారని జనసేన పార్టీ మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని అన్ని రంగాలలో మహిళలు రాణించాల్సిన అవసరం ఉందని, భావితరాల కోసం జనసేన పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. సామాజిక బాధ్యత దేశ భక్తి నిండిన జనసేనలో పని చేయడం గర్వంగా భావిస్తున్నామని ఆయన తెలియచేసారు.

మహిళా విభాగం నాయకులు మాట్లాడుతూ
ఝాన్సీ లక్ష్మీబాయి స్పూర్తితో తో జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అనేక కార్యక్రమాలుచేపడుతున్నామని ఒకవైపు కుటుంబాన్ని నడుపుతూ మరోవైపు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు.మహనీయుల స్పూర్తితో అందరూ పని చేయాలని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా విభాగం నాయకులు శిరీషా రెడ్డి, విజయలక్ష్మి, జ్యోతి జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి, కార్తీక్, షారుక్,వెంకట్, నాని,బాలకృష్ణ,సుజన్, శ్రీను సుధీర్, ఇమ్రాన్, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment