ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం

ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక సందర్బంగా APJF రాష్ట్ర కార్యదర్శి వంశి కృష్ణ , రాష్ట్ర అధ్యక్షులు కృష్ణన్జనేయులు , రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ని ఘనంగా సన్మాన సన్మానించారు ఈ సందర్భముగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు అందజేశారు . ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకవచ్చేందుకు కృషి చేయాలన్నారు . గంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్ట్ ల సంక్షేమంకోసం హెల్త్ కార్డులు , మండల స్థాయి నుంచి జిల్లాలో పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కు ఇళ్ల ప్లాట్లు కేటాయించటం జరిగిందని ,జర్నలిస్టులందరికీ ఉచితంగా కట్టించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు .అలాగే విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడే పాత్రికేయ సోదరులకు ప్రభుత్వం ఉచిత ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు .
కేతంరెడ్డి వినోద్ రెడ్డి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment