కాంగ్రెస్ సభ సక్సెస్ వెనుక కేతంరెడ్డి కష్టం

నెల్లూరులో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా
నగరంలో నిర్వహించిన ర్యాలీ, ఇందిరాభవన్ లో జరిగిన బహిరంగ సభలకు పిసిసి అధ్యక్షులు ఎన్. రఘవీరారెడ్డి, కేంద్ర మాజీ
మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట మాజీ మంత్రి శైలజానాథ్ తదితరులు పాల్లొన్నారు. ర్యాలీతో పాటూ బహిరంగ సభకు  మంచి స్పందన లభించడంతో నేతలంతా ఆనందంలో మునిగిపోయారు. ఈ ర్యాలీ, బహిరంగ సభ సక్సెస్ అయ్యేందుకు తెర వెనుక రాత్రింబవళ్లు కష్టపడ్డ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డిని వారు అభినందించారు. సోమవారం జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను 10 రోజుల ముందు నుండే వినోద్ రెడ్డి చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు పెద్ద సభలను నిర్వహించిన అనుభవం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ కు సంభందించి ఏ సభ జరగాలన్నఆనం సోదరులే నిర్వహించేవారు. అందువల్ల సభలు, ఇతర కార్యక్రమాల నిర్వహణను కాంగ్రెస్ లో, ప్రస్తుతమున్న నాయకులెవ్వరూ పట్టించుకునే వారు కాదు. ఆనం సోదరులు, ఆయన అనుచరులు టిడిపిలోకి వెళ్లిపోవడంతో కార్యక్రమాల  నిర్వహణ గురించి తెలిసిన వారు కాంగ్రెస్ లో లేకుండా పోయారు.

ఈ నేపద్యంలో దానిపై పూర్తిగా అవగాహన కలిగిన ఏకైక వ్యక్తి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డికి
ఆ బాధ్యతలను అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి శిష్యుడిగా, ఆయనతో సన్నిహితంగా ఎంతో కాలంగా
ఉన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నారు. ఆనం హయాంలో ప్రచార బాధ్యతలన్నీ వినోద్ రెడ్డే నిర్వహంచేవారు. సభలకు సంభందించిన ప్రచారం, వేదిక అలంకరణ, కార్యకర్తల తరలింపు తదితర అంశాల్లో వినోద్ రెడ్డి దిట్ట. ఈ నేపద్యంలో నూతన డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య, పిసిసి ఉపాధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి ఆ బాధ్యతలను వినోద్ రెడ్డికి అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీ, జాతీయ నేతల విగ్రహాలకు నివాళులు అర్పించే కార్యక్రమాలను వినోద్ రెడ్డే రూపకల్పన చేశారు. నగరమంతా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, ఇందిరాభవన్ ను అందంగా ముస్తాబు చేశారు. గాంధీబొమ్మ నుండి కార్యకర్తలతో ర్యాలీ ఏర్పాటు చేసి నాయకుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. అలాగే వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలను తరలించారు. సభ సక్సెస్ కు ఎంతో కష్టపడ్డారు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. సభ విజయవంతం కావడంతో పిసిసి అధ్యక్షులు రఘవీరారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇందిరాభవన్ లో కేకును కట్ చేసిన రఘవీరారెడ్డి అదిపనిగా వినోద్ రెడ్డిని పిలిచి, కేకును స్వయంగా తినిపించి, బాగా చేశావంటూ అభినందనలు తెలిపారు. పార్టీలో నీకు మంచి  స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇటీవల జిల్లాలో వరదలు సంభవించినప్పుడు రఘవీరారెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో నెల్లూరు పర్యటన
మొత్తం కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. కేతంరెడ్డి వినోద్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానే కాకుండా
ఏ.పి.సోషల్ మీడియా ఇంఛార్జ్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment