నెల్లూరుకు హడ్కో రుణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీర్మానం

జూన్ 13 ( నెల్లూరు ) – నెల్లూరు నగర ప్రజలకు తీరని అన్యాయం చేసే హడ్కో రుణంపై తీవ్ర అభ్యంతరాన్నివ్యక్తం చేశారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి. అభివృద్ది పేరుతో అప్పులు చేస్తున్ననెల్లూరునగర పాలక సంస్థ బండారాన్ని ప్రజలకు తెలియజేసి దాన్ని అడ్డుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. దీనిపై పార్టీ పరంగా కాకుండా అన్నీపార్టీలను కలుపుకు పోయి దాన్నిఅడ్డుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరులోని హోటల్ డి.ఆర్. ఉత్తమ హోటల్ లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సి.వి.శేషారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉడతా వెంకట్రావ్, సంగం షఫీ, రైతు సంఘం నాయకులు బెజవాడ గోవిందరెడ్డి, న్యాయవాది సుధీర్ రెడ్డి, విద్యార్ధి సంఘం నేత ఎస్. మౌళియాదవ్, చిరంజీవి యువత నేతలు శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వివిధ సంఘాల నాయకులు మంతు మురళీరెడ్డి, ఉడాలి సూర్యనారయణ, హుస్సేన్, ఫజలుద్దీన్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్ష సమావేశం అనంతరం పలు తీర్మనాలను చేశారు. హడ్కో రుణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. దీనిపై వెబ్ పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ, సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం అఖిల పక్ష కమిటికి అధ్యక్షునిగా ఎన్నికైన కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది పేరుతో
నెల్లూరునగరాన్ని హడ్కోకు తాకట్టు పెట్టారని చెప్పారు. దీనిపై ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment