డెంగ్యూ జ్వరాలు కు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలి

డెంగ్యూ జ్వరాలు కు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలి
– జనసేన పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి
_________________________________

డెంగ్యూ జ్వరాలు బారినపడి ప్రాణాలతో పోరాడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించి ఆదుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు నగరంలోని బొడిగాడి తోట ప్రాంతంలో డెంగ్యూ జ్వరాలు నివారణ కోసం జనసైనికులతో కలిసి ఆయన మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం కరువైందని ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు అని ఆయన అన్నారు..ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన వైద్యం దొరకక ప్రైవేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యాన్ని కొనలేక సతమతమవుతూ అనారోగ్యంతో ప్రాణాలు విడుస్తున్న సంఘటనలు రోజురోజుకూ అధికమవుతున్నాయి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.అనంతరం బోడి గాడి తోట ప్రాంతంలోని నిరుపేదలకు ఇంటింటికి వెళ్లి డెంగ్యూ నివారణ మందులను పంపిణీ చేశారు దాదాపుగా 250 కుటుంబాలకు చెందిన వెయ్యి మంది వెయ్యి మందికి ఈ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి,మోషే,మైఖేల్, రేవంత్,కార్తిక్,వెంకట్,చందు,బాషా,కిరణ్ మహిళా నాయకులు శిరీషా రెడ్డి, షేక్ ఆలియా తదితరులు పాల్గొన్నారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment