రిజెక్ట్ జగన్..రిజెక్ట్ వైసిపి..ఇదే బీసీల నినాదం కావాలి

*రిజెక్ట్ జగన్..రిజెక్ట్ వైసిపి..ఇదే బీసీల నినాదం కావాలి.*
*-జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి*

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కేటాయింపులలో బీసీలకు మొండి చెయ్యి చూపించి ఘోరంగా మోసం చేసిన వైసిపి పార్టీని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీలంతా బలంగా వ్యతిరేకిస్తున్నారని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.నెల్లూరు నగరంలో ఓ హోటల్లో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలతో పాటు బీసీ సోదరులను కూడా మోసం చేశారని ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్లే దానికి నిదర్శనమని కేతంరెడ్డి అన్నారు.బీసీలకు ఎటువంటి సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోని జనసేన పార్టీ అండగా ఉంటుందని అందులో భాగంగా బిసి రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నట్లు కేతంరెడ్డి తెలిపారు.ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం తప్ప, పరిపాలన గురించి ప్రజా ప్రయోజన విధానాల గురించి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, అందువల్లే అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని వీటన్నిటినీ ఎదుర్కొనేందుకు బీసీలు ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
వారి హక్కుల సాధనలో జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు
పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి తదితరులు పాల్గొన్నారు

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment