సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్యకరమైన దుష్ప్రచారం

నా పైన మరియు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్యకరమైన మరియు అసభ్యకరమైన దుష్ప్రచారం పై నెల్లూరు నగర పరిధిలోని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఒక ప్రత్యేక అజెండా తో ఈ దుష్ప్రచారం చేపట్టిన వారికి ఒక్కటే చెప్పదలచుకుంటున్నా…
భగవంతుని దయతో, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో మీకు ప్రజలకు సేవ చేసుకునే ఒక మంచి అవకాశం దక్కింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో ఎవరూ నిర్దేశించలేరు… నేడు మీకు ఉన్న అవకాశంతో మన నెల్లూరు ప్రజలకు ఏమి మంచి చేద్దామా, నగరాన్ని ఎలా అభివృద్ధి చేద్దామా అని ఆలోచించండి. అది మాని ప్రత్యర్థుల రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడితే భవిష్యత్తే తగిన గుణపాఠం నేర్పుతుంది.

-కేతంరెడ్డి వినోద్ రెడ్డి
జనసేన పార్టీ, నెల్లూరు సిటీ

ketham reddy vinod reddy

A long journey where i get active everyday instead of tiring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *