ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి – హోదా కోసం కేతంరెడ్డి ఆందోళన

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు యూత్ కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్పీ కేవిపి రామచంద్రారావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై నేడు చర్చ జరగనున్న నేపద్యంలో కేతంరెడ్డి నెల్లూరులోని మహాత్మాగాంధీ నగర్ మెయిన్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోదా బిల్లులు అన్నీపార్టీలు మద్దతు పలకాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు గ్రాంటుగా వస్తుందని వివరించారు. ఈ నిధుల ద్వారా రాజధాని అభివృద్ధితో పాటూ రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. తెలుగుదేశం,బిజేపి పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా బిల్లులు మద్దతివ్వకుంటే తెలుగు ప్రజలు క్షమించరని హెచ్చరించారు. పిసిసి అధ్యక్షులు రఘవీరారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వెల్లడించారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment