ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన విధానం

*ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన విధానం.*
– జనసేన పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి
———————————————–
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లోని జనసేన పార్టీ ముందుకు సాగుతోందని జనసేన పార్టీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు నెల్లూరు నగర కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు,డివిజన్లకు చెందినటువంటి 70 మంది యువకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిబద్ధత, భావితరాల కోసం జనసేన చేస్తున్నటువంటి పోరాటం, ఇటీవల భవన నిర్మాణ కార్మికుల విషయంలో వారికి అండగా నిలిచిన తీరు, తదితర అంశాలతో ఆకర్షితులై యువకులు జనసేన పార్టీలో పని చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.రాష్ట్రంలో జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని. యువతరం ఆశాజ్యోతిగా, ఆడపడుచులకు అండగా, అన్నదాతల పక్షపాతిగా, సమసమాజ స్థాపన ధ్యేయంగా జనసేన పార్టీ ప్రస్థానం సాగుతుందని..ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందని, రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని..ఆయన అన్నారు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పార్టీలో చేరినటువంటి యువకులకి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి,సురేష్ నాయుడు,సారధి,వినయ్,కార్తీక్,మహిళా నాయకులు శిరీష రెడ్డి, షేక్ ఆలియా,లావణ్య,మరియు జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Avatar

ABOUT THE AUTHOR

ketham reddy vinod reddy
A long journey where i get active everyday instead of tiring.

Leave A Comment